google-site-verification=aO4irLnVmA5Mj9RydAINRqOzCQWpYFornA1L7bbI3ko gtag('js', new Date()); gtag('config', 'G-0R6CVRC49E'); SP బాల సుబ్రహ్మణ్యం గారి హిట్ సాంగ్స్ లిస్ట్ PDF రూపంలో click here - Education Information
ads

SP బాల సుబ్రహ్మణ్యం గారి హిట్ సాంగ్స్ లిస్ట్ PDF రూపంలో click here




ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు సంగీత దర్శకుడిగా నేపథ్యగాయకుడిగా నటుడిగా
 మనందరికీ సుపరిచితం. తెలుగు,తమిళ, కన్నడ, హిందీ మరియు ఇతర సుమారు
 నలభై వేలకు పైగా పాటలు పాడారు.
 ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.
మనము ముద్దుగా బాలు అని పిలుచుకుంటాం.

 ఈయన నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ 
కుటుంబంలో జన్మించారు.
 తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.
తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు.
 చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొని బహుమతులు సాధించాడు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జననం 1946 జూన్ 4 న  నెల్లూరు జిల్లాలోని కోనెటమ్మ పేట గ్రామంలో
 ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రస్తుత వయస్సు 74 సంవత్సరాలు.
బాల సుబ్రహ్మణ్యం గారికి గల ఇతర పేర్లు బాలు,గాన గంధర్వుడు. 
ఈయన నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, 
క్రియాశీలక పాత్రలు ఎన్నో చేశారు. 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. 

ముగ్గురు కుమారులు, అయిదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబంలో బాలసుబ్రమణ్యం
 రెండవ కుమారుడిగా జన్మించాడు. బాల్యము నుండే బాలుకు పాటలు పాడటం 
ఒక హాబీ గా ఉండేది. 
తండ్రి కోరిక మేరకు ఇంజనీర్ కావాలనే ఆశయంతో మద్రాసులో కోర్సులో చేరాడు. 
ఆ కాలంలోనే వివిధ పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు.
 బాలసుబ్రమణ్యం చదువుకునే రోజుల్లోనే ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్ళు 
మంచి ఇంజనీర్ కావాలని ప్రభుత్వ శాఖలో ఇంజనీర్ గా పని చేయాలని కలలు కనేవాడు.

బాలుకు సావిత్రి తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు చరణ్ మరియు పల్లవి.
 కొడుకు ఎస్పీ చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తరువాత సినీ నిర్మాతగా మారాడు. 
బాలు సోదరి ఎస్.పి.శైలజ కూడా సినీ నేపథ్య గాయని.
ఈమె సోదరుడితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. 
ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ నువ్వు వివాహం చేసుకుంది.

Click here to see songs of SPclick here to see the sp songs

1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంలో సినీ గాయకుడిగా 
ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.తర్వాత మరిన్ని అవకాశాలు ఉంటాయి. 
మొదట్లో ఎక్కువగా తెలుగు,తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. 
చాలామంది నటులకు వారి హావభావాలు నటన శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు. 
కథానాయకుడు పాడుతున్నాడు అన్నట్లుగా నటులకు తగిన హావభావాలతో తన గాత్రాన్ని 
పలకరించేవారు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు.
1969లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రలో నటించాడు.
తరువాత అనేక తమిళ తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు.
డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేక మంది కళాకారులకు గాత్రదానం చేశారు.
కమల్హాసన్, రజనీకాంత్, గిరీష్ కర్నాడ్ ,అర్జున్ జెమినీ ,గణేష్ ,విష్ణువర్ధన్,
రఘువరన్లాంటి వాళ్లకు గాత్రదానం చేశారు.

సినిమాల్లోనే కాకుండా టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా, పాడాలని ఉంది .
ఇలాంటి కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించి,ఎంతోమంది నూతన గాయనీ,
గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం 
ఇలాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు. బాల సుబ్రహ్మణ్యం గారి ద్వారా ఆ కార్యక్రమం 
ఎంతో ప్రాముఖ్యతను పొందింది.

ఎస్పీ Balasubramanyam gaaru  అందుకున్న పురస్కారాలు భారతీయ భాషల్లో ఆయన 
సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు .అత్యధిక పాటలు రికార్డ్ చేసిన గాయకుడిగా ఆయన 
పేరిట ఒక రికార్డు ఉంది.ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఆరు జాతీయ పురస్కారాలు, 
దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నాడు. 

1979లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం 
లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981లో బాలీవుడ్లో ప్రవేశించి ఏక్ దూజే కేలియ 
చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత సాగరసంగమం-1983 రుద్రవీణ 
1988 చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 
25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా ,ఉత్తమ 
సహాయ నటుడుగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల
 నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 
2001వ సంవత్సరంలో పద్మ శ్రీ  పురస్కారాన్ని అందుకున్నారు. 
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నర్ చేతుల మీదుగా పద్మ భూషణ్ అవార్డును 
2011 సంవత్సరంలో పొందారు. శత వసంతాల భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం 
2016 కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతులమదుగా నంది పురస్కారం
 ప్రత్యేక బహుమతి పొందారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం 
అందుకున్నా
డు.

 ఇంకా తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 
2012లో ఆయన నటించిన సినిమాలకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. 
ఇటువంటి గొప్ప గాయకుడు కరోనాతో పోరాడి  
25-09-2020 నాడు ప్రాణాల్ని విడవడం ఎంతో బాధాకరం.


ఇటువంటి  సంగీత దర్శకుడిని నేపథ్య గాయకుడు సుప్రసిద్ధ గాయకుడిని ,
నటుడిని నిర్మాతని మనం కోల్పోవడం మనందరి దురదృషత.
click on down blue lines PDF file of songs

No comments:

ads
Powered by Blogger.