సుకన్య సమృద్ధి యోజన పథకం లో కొత్తగా వచ్చిన మార్పులు మరియు పూర్తి వివరాలు
సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు:
సుకన్య సమృద్ధి యోజన పథకం ను మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు "బేటీ బచావో బేటి పడావో "
కార్యక్రమం లో భాగంగా దీనిని ప్రారంభించారు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం దీనిని ప్రారంభించడం జరిగింది.
ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆడపిల్లల చదువు కోసం ప్రారంభించడం జరిగింది.
సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క అర్హులు:
ఈ పథకం లో పది సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఆడపిల్ల దీనికి అర్హురాలు.
కుటుంబంలో ఇద్దరూ ఆడపిల్లలకు ఈ పథకంలో చేరడానికి అర్హులు. పుట్టినప్పటినుంచి
పది సంవత్సరాలు ఉన్న అమ్మాయిలను ఈ పథకంలో చేర్పించవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క కాలపరిమితి:
ఈ పథకం యొక్క కాలపరిమితి 15 సంవత్సరాలు. అనగా ఈ పథకాన్ని 15 సంవత్సరాలు వరకు కట్టాలి.
సుకన్య సమృద్ధి యోజన పథకం ను అమ్మాయి 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం
కొంత డబ్బును కట్టాలి. ఆ తరువాత ఆరు సంవత్సరాలు ఆగాలి ఎలాంటి డబ్బులు చెల్లించరాదు.
మీ అమ్మాయి వయస్సు 21 సంవత్సరాలు నిండిన తరువాత వడ్డీతో సహా పెట్టుబడిని తీసుకొని
మీ అకౌంట్ ను రద్దు చేసుకోవచ్చు.
ఒకవేళ 18 సంవత్సరాలు నిండిన తర్వాత పై చదువుల కోసం 50 శాతం డబ్బును తీసుకోవచ్చు
లేదా అమ్మాయి వివాహం కోసం కూడా డబ్బును తీసుకోవచ్చు.
వివాహం కోసం అయితే 100% డబ్బును తీసుకొని అకౌంట్ రద్దు చేసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన కనిష్ట మరియు గరిష్ట పెట్టుబడి:
దీనిలో చేరడానికి కనిష్టంగా 250 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా ఒక లక్ష యాభై వేల రూపాయల
వరకు దీనిలో పెట్టుబడిగా పెట్టవచ్చు. మనకు తోచినట్లు కనిష్టంగా 250 రూపాయల నుండి గరిష్టంగా
ఒక లక్షా 50 వేల రూపాయల వరకు ప్రతి సంవత్సరం ఎంత అయినా కట్టవచ్చును.
మనము పెట్టిన పెట్టుబడికి ప్రతి సంవత్సరం వడ్డీతో కలిపి లెక్క చేయగలరు.
సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరే విధానం:
ఈ పథకంలో చేరడానికి మీ దగ్గరలోని ఏదైనా నా పోస్ట్ ఆఫీస్ లో కానీ ప్రభుత్వ లేదా
ప్రైవేటు బ్యాంకులో కానీ చేరవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పథకం లో చేరడానికి కావలసిన పత్రాలు:
1. Birth certificate of baby
2. Aadhar card of a baby and parents
3. PAN card of parent
4. Identity proof of a parent with baby (photo)
5. Joint account (parent and baby) in a bank or post office
పై పత్రాలను తీసుకొని పోస్ట్ ఆఫీస్ గాని బ్యాంకు కానీ వెళితే అక్కడ అ సుకన్య సమృద్ధి యోజన
పథకం యొక్క ఫామ్ ని తీసుకుని వివరాలను పూర్తిచేసి, పై పత్రాలను జతచేసి డబ్బులు కట్టవలెను.
ఈ పథకంలో కొత్తగా వచ్చిన మార్పులు:
1.ఈ పథకంలో ముందు కనిష్ట పెట్టుబడి వెయ్యి రూపాయలు ఉండేది. ఇప్పుడు కనిష్ట పెట్టుబడి ₹250.
2. ఈ పథకంలో ముందు ఒక కుటుంబంలో లో ఇద్ద రు అమ్మాయిలకు మాత్రమే అర్హత ఉండేది. ఇప్పుడు ఒక కుటుంబంలో లో ముగ్గురు అమ్మాయిల వరకు ఈ పథకంలో లో చేర్పించవచ్చు.
3. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా మార్చి 2020 నుండి జూన్ 2020 మధ్యలో ఎవరైనా పది సంవత్సరాలు వయస్సు
నిండిన అమ్మాయిలను కూడా ఈ పథకంలో చేర్పించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
4. ఏదైనా కారణం చేత తల్లిదండ్రి ఎవరైనా చనిపోతే ఆ పాపకి సంరక్షకులుగా వేరే ఏ వ్యక్తి అయినా మార్చుకోవచ్చు.
ఈ పథకం యొక్క ఉపయోగాలు:
1. ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడం వల్ల 80c కింద టాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఒక లక్షా 50 వేల వరకు టాక్స్ బెనిఫిట్ ఈ పథకం కింద పొందవచ్చు.
2. ప్రతి సంవత్సరం 7.9 శాతం వడ్డీ లభిస్తుంది.
3. పై చదువులకు ప్రతి సంవత్సరం పొదుపు చేసుకోవచ్చు.
4. వివాహ ఖర్చులకు కూడా ఉపయోగించుకోవచ్చు.
5. పాప భవిష్యత్తు పై బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు.
if you invest Rs.15000 at 5 years in 2020,total investment for 15 years Rs.2,25,000,you will get intrest Rs.4,11515 maturity year 2041 you will get Rs.6,36,515
if you invest Rs.4000 at 5 years in 2020,total investment for 15 years Rs.60,000,you will get intrest Rs.1,09,737 maturity year 2041 you will get Rs.169737
for more investments click on the below link
this is application form of sukanya samvrudhi yojna👆



No comments: